పిల్లలు లేక వెలవెలబోతున్న అంగన్ వాడి  సెంటర్..

– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – చివ్వేంల
మండల కేంద్రంలోని అంగన్ వాడి సెంటర్ -1లో సోమవారం పిల్లలు లేక వెలవెలబోతున్న దృశ్యం నవతెలంగాణ కు చిక్కింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంగన్ వాడి సెంటర్లను నిర్వహిస్తుంటే, మండల కేంద్రంలో అన్ని  ప్రభుత్వం కార్యాలయాలు అధికారులు అందుబాటులో ఉంటేనే  అంగన్ వాడి సెంటర్ లో పిల్లలు లేకుండా టీచర్ ఖాళీగా కూర్చుంటే, మారుమూల గ్రామాలలోని అంగన్ వాడి సెంటర్ల పరిస్థితి ఎలావుంటుందో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అంతా తెలిసి కూడా ఐసిడిఎస్ అధికారుల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పటికైనా అంగన్ వాడి సెంటర్లలో పిల్లలు ఉండేవిదంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విచారణ చేస్తాము..సిడిపిఓ శ్రీవాణి: అంగన్ వాడి సెంటర్ లో పిల్లలు ఉండాలి.. పిల్లలు లేకపోవడం పట్ల విచారణ చేస్తాము.బాద్యులపై చర్యలు తీసుకుంటాము.
Spread the love