సమ్మెలో స్పృహ కోల్పోయిన అంగన్వాడీ ఆయా

– దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలింపు
– ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చెలగాటం ఆడోద్దని హెచ్చరిక 
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడోద్దని సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి జీ. పద్మ మండిపడ్డారు. తాజాగా దుబ్బాక నియోజక పరిధిలోని 5 మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు , ఆయాలు సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. శుక్రవారం ప్రభుత్వం మొండి వైఖరిని తట్టుకోలేక రుద్రారం గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా  లక్ష్మీ నర్సవ్వ (45) సమ్మె చేస్తుండగా ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. దీంతో వారు 108 కి సమాచారం అందించగా.. చికిత్స నిమిత్తం లక్ష్మీ నర్సవ్వ దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలూన్ ఎక్కించి ఆరోగ్యం నిలకడగా ఉంచేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఈ ఘటనతో అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ…. అంగన్వాడీల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడోద్దని హెచ్చరిస్తున్నారు.
Spread the love