అంగన్వాడీ కేంద్రాలు సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడీ కేంద్రాలు కు కందిపప్పు నెలల తరబడి సరఫరా చేయకపోతే నిరుపేద గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ఎలా సాద్యం అవుతుంది అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. ఐసిడిఎస్ అశ్వారావుపేట ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లోను, సిబ్బంది ఎదుర్కొంటున్న  సమస్యలు పరిష్కరించాలని మంగళవారం సూపర్ వైజర్ విజయలక్ష్మికి సమస్యలుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కు పప్పు లు రాకపోతే కూరగాయలైనా కొనిపెట్టలని ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లు పై ఒత్తిడి తెస్తున్నారని, ఆకాశాన్ని అంటే ధరలతో ఎలా కాయకూరలు వండిపెడతారని అన్నారు. పెండింగ్ లో ఉన్న టీఏడీఏలు, సెంటర్ అద్దెలు,ఆరోగ్య లక్ష్మి బిల్లులు,ఈవెంట్స్ డబ్బులు బిల్లులు వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ  సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ.26 పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు రాధా, నాగమణి, రాజేశ్వరి లక్ష్మి, మనీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love