అంగన్వాడీ సమస్యలు పరిష్కరించటంలో పూర్తిగా విఫలం

నవతెలంగాణ-మధిర
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి సిఐటియు, ఏఐటీఐయూసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా 9వ మంగళవారం మధిరలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారం అనంతరం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చాలా పద్మ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు, ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అయినవారికి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించలేదని, కనీస వేతన చట్టం అమలు పరచడం లేదని, అదనపు పనికి వేతనం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. అంగన్వాడి ఉద్యోగులను ఆయాలను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, అదనపు, పనికి అదనపు వేతనం ఇవ్వాలని రాజకీయ ఒత్తిడి లను నివారించాలని, పని భారాన్ని తగ్గించాలని ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ఇప్పటివరకు తొమ్మిది రోజుల పాటు సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి కళ్ళు లేవని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు, సిఐటియు మధిర టౌన్‌ కన్వీనర్‌ పడకంటి మురళి, సిఐటియు మండల నాయకులు వడ్రానపు మధు, అంగన్వాడీ టీచర్స్‌, మినీ వర్కర్స్‌ ఆయాలు పాల్గొన్నారు.

Spread the love