పదవ రోజుకు అంగన్వాడీల సమ్మె

Anganwadi strike for 10th dayనవతెలంగాణ-మహాబూబాబాద్‌
అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మ రికుంట్ల నాగన్న డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంగన్‌వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ, ఏఐటీ యూసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె బుధవారం నాటికి పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి కుమ్మరికుంట్ల నాగన్న మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి అంగన్వాడిల సమస్యలు పరిష్క రించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెపై ఐసిడిఎస్‌ అధికారు లు తీవ్రమైన ఒత్తిడి వేధింపులకు సిబ్బందిపై పాల్పడుతున్నా రని, సెంటర్లో తాళాలు పగలగొట్టి దొంగల్లాగా ప్రవర్తిస్తున్నా రని తెలిపారు. ఐసిడిఎస్‌ సిబ్బంది వేధింపులకు పాల్పడి అం గన్వాడిలా మానసిక ధైర్యాన్ని దెబ్బతీసినచో ప్రతిఘటన త ప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శు లు స్నేహ, బిందు, ఎల్లారీశ్వరి, మంగా, మల్లికాంబ, ఆండా లు, రమ, లలిత మొదలగు వారు పాల్గొన్నారు.
నరసింహులపేట : అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ స భ్యులు గునుగంటి మోహన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలో గత 10రోజుల నుండి అంగన్వాడీ కా ర్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఎం పార్టీ నాయకులు పాల్గోని సమ్మెకు తమ సంఘీభావం, సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈసందర్బంగా మోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప నిచేసే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్‌, స్కీం కార్మికులు, గ్రామ పంచాయతీ తదితర శాఖల్లో పనిచేసే వివిధ రకాల కార్మికు లను సీపీఎం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు, ఆయాలు, తదిత రులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్‌, ఆయాలు నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని బుధవారం టీప ీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు వడ్లూరి వేణుగోపాల్‌ సంద ర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హా జయ్యారు. అనంతరం స్థానిక మండల కేంద్రంలో వినాయక గణపతి మండపం వేదికలో అంగన్వాడి ఉద్యోగులు, ఆయా లు విగేషునికి వినతి పత్రం అందజేశారు. అర్చకులు కూడా సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటి ఎఫ్‌ జిల్లా నాయకులు జినకల వెంకటరామనరసయ్య, కోట శేఖర్‌, బిక్షం, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : అంగనవాడి ఉద్యోగులపై అధికారుల వేధిం పులు ఆపాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ వెల్ఫర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బెస్త సంపూర్ణ అన్నారు. బు ధవారం పదవరోజు సమ్మెలో భాగంగా మరిపెడ మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ అల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గాంధీ బొమ్మకు వినతి పత్రాన్ని అందజేసి ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీ ల కేసులు పెడతాం జైల్లో పెడతాం అంటూ ఆందోళన చేస్తు న్న అంగన్వాడి కేంద్రాలపై దాడులు చేసి తాళాలు పగలగొట్ట డం సరైన పద్ధతి కాదని ఆమె అధికారులను హెచ్చరించా రు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను వెంట నే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అ బ్బాయి పాలెం సెక్టార్‌ లీడర్లు రాములమ్మ, స్వరూప, మంగ మ్మ, ధర్మారం సెక్టార్‌ లీడర్లు నీలమ్మ, లక్ష్మి, ఎల్లంపేట సెక్టా ర్‌ నాయకురాలు జ్యోతి, కవిత, నిలుకుర్తి సెక్టార్‌ నాయకురా లు ఉమ, తాళ్ల ఉకల్‌ సెక్టార్‌ లీడర్‌ రమ, స్వర్ణ, మరిపెడ సె క్టార్‌ నాయకురాలు కళమ్మ, పుష్ప, తదితరులు ఉన్నారు.
తొర్రూరు : డివిజన్‌ కేంద్రంలో గత 10 రోజులుగా అం గన్వాడీ కార్యకర్తల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిం చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు పా లకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి బుధవారం సంఘీభావం తెలిపారు. దీక్షా శిబి రంలో కూర్చుని అంగన్వాడీల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని నినదించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
గూడూరు : అంగన్వాడిల సమ్మె బుధవారం నాటికి పదవ రోజుకు చేరింది. శిబిరాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ శైలం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు జోగరణధీర్‌, కొట్టం అ చ్చన్న, గజ్జి లింగన్న, వాసం భద్రయ్య పాల్గొన్నారు.
కురవి : అంగన్వాడీల నిరవదిక సమ్మె బుధవారంకు ప దో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి సిఐటియు మండ ల కన్వీనర్‌ పోతుగంటి మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని దీక్షను ప్రారంభించి మాట్లాడారు.అంగన్వాడీలకు ప్రభు ్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆయన వి మర్శించారు. ఈ సమ్మెలో గుగులోత్‌ సరోజ, తారా, కవిత, మహాలక్ష్మి, శారద, భద్రమ్మ, సరిత, సుగుణ పాల్గొన్నారు.
నెల్లికుదురు : అంగన్వాడీ టీచర్‌ ఆయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్‌ ఆయాల కళ్లకు గంతలు క ట్టుకొని ఒంటికాలు పై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్య క్రమంలో కుమ్మరికుంట్ల మాధవి,చిర్ర లక్ష్మీనరసమ్మ, ఎల్లమ్మ, సరస్వతి, పద్మ, వెంకటలక్ష్మి, జ్యోతి, రాజ్యలక్ష్మి, పద్మ, సక్కుబా యి, వెంకటలక్ష్మి, వీరలక్ష్మి పాల్గొన్నారు.
పెద్దవంగర : అంగన్వాడీఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని అంగన్వాడీ టీచర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పసుల స్వరూప డిమాండ్‌ చేశారు. బుధవారం అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్ల పరి ష్కారం కోసం తహశీల్దార్‌ వీరగంటి మహేందర్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులుమంజుల, ఝా న్సీ, రేణుక, అంబిక, మమత, యాదమ్మ, యాకలక్ష్మీ, ఎల్లమ్మ, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love