వినాయకుని వేడుకుంటున్నట్టు అంగన్వాడీ టీచర్లు

నవతెలంగాణ- మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు మంగళవారం రోజున వినూత్నంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి తమ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికైనా కేసీఆర్ మనసు మార్చి మా డిమాండ్లను పరిష్కరించేటట్లు చేయమని ఆ వినాయకుని వేడుకుంటున్నట్టు వారు తెలిపారు. అలాగే దాదాపు తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేపడుతున్న కూడా ప్రభుత్వ మనసు తరగతుల లేదని ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఇలా బాధ పెడతారని ఇప్పటికైనా దయచేసి  మా డిమాండ్లను పరిష్కరించేటట్టు చూడాలని వారు కోరుకున్నారు దాదాపు ఎంతసేపు మోకాళ్లపై నిలబడి ఆ వినాయకుడికి ప్రార్థనలు చేశారు

Spread the love