సమ్మెలో అంగన్‌వాడీలు

– తాళాలు పగలగొట్టి నర్కూడలో కేంద్రాలు తెరిపించిన ఐసీడీఎస్‌ అధికారులు
– పంచాయతీ అధికారికి తాళం చెవిలు అందజేత
– లబ్దిదారులకు ఫుడ్‌ పంపిణీ చేయాలని వినతి
– ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు : సూపర్‌వైజర్‌ సుగుణ
నవతెలంగాణ-శంషాబాద్‌
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె బాట పట్టారు. సమ్మె కారణంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన ఆహారం లబ్దిదారులకు అందకుండా పాడవుతుందన్న సాకుతో ఐసీడీఎస్‌ అధికారులు బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి తెరిపించారు. ఈ ఘటన శంషాబాద్‌ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో మంగళవారం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాలు తె రవడానికి అధికారులు గ్రామానికి వస్తున్నారన్న సమాచారం అంగన్‌వాడీలకు అందింది. దీంతో వా రు గ్రామానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఐటీ యూ జిల్లా నాయకులు నీరటి మల్లేష్‌, జి.విక్రంకు మార్‌, అంగన్‌వాడీ టీచర్లు, సర్పంచ్‌ సిద్దులతో సమ్మె చేయడానికి గల పరిస్థితులను తెలిపారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాక కోసం సుమారు రెం డు గంటల పైగా అంగన్‌వాడీలు ఎదురు చూశారు. అనంతరం కందుకూరులో మీటింగ్‌కు వెళ్లారు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే సెక్టార్‌ సూపర్‌వైజర్‌ సుగుణ, శంషాబాద్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ భిక్షమమ్మ నర్కూడ కేంద్రానికి చేరుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద నోటీసులు అంటించారు. గ్రామ సర్పంచ్‌ సునిగంటి సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహ సమక్షంలో బలవంతంగా కచేరి వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రం తాళాలను కటింగ్‌ మిషన్‌తో విరగగొట్టారు. కేంద్రంలో ఉన్న ఆహారం, ఇతర సామాగ్రి అధికారుల సమక్షంలో లెక్కించారు. అనంతరం అంగన్‌వాడీ సెక్టార్‌-2, సెక్టార్‌-3లో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో తాళాలు పగల గొట్టారు. కేంద్రాలకు వేరే తాళాలు వేసి ఆ తాళం చెవిలను పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. పంచాయతీ కార్యదర్శి చొరవ తీసుకొని లబ్దిదారు లకు ఆహారం పంపిణీ చేయాలని సూపర్‌వైజర్‌ కోరారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్‌ సుగుణ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రం వద్ద నోటీసులు అంటించామని తెలిపారు. ఆహారం లబ్దిదారులకు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశించడంతో తాము వచ్చామని తెలిపారు. తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సామాన్లు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించా మని తెలిపారు. సర్పంచ్‌ సిద్ధులు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలతో అంగన్‌వాడీలు పనిచేస్తు న్నారని, ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, పోలీసులు, నాయకులు తొంట అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love