అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– 9 రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
– జూలకంట,.ప్రజాసంఘాలు మద్దతు
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 9వ రోజు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల చే ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీలు సమ్మె చేయాలని కోరారు దానికి తమ వంతు మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. అంగన్వాడీలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పారు. అంగన్వాడిలో న్యాయమైన డిమాండ్‌ ను వెంటనే నెరవేర్చాలన్నారు. అంగన్వాడీల అసోసియేషన్‌ ఉప ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అధికారులు దౌర్జన్యాలు ఆపాలని ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడాలని అన్నారు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉన్నదని వారన్నారు పోరాటంలో ఉన్న సంఘాలను పిలిచి చర్చ జరపాలని వారన్నారు. టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబొయిన వరలక్ష్మి, వేములపల్లి వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధన రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు రామయ్య మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌ రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్‌, ధీరావత్‌ లింగా నాయక్‌ జిల్లా యాదగిరి, అంగన్వాడీ టీచర్స్‌ పార్వతి, ప్రమీల, మల్లేశ్వరి, నిర్మల, అరుణ, రాధాబాయి, రాణి, సిహెచ్‌ సుజిత, వజ్రమ్మ, కారంపొడి భాగ్యమ్మ, వి భవాని, ఎస్‌ కే సైదాబీ, లక్ష్మమ్మ, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు

Spread the love