సమస్యలు పరిష్కరించే వరకు అంగన్‌వాడీలు పోరాడాలి

Anganwadis should fight till the issues are resolved– సీఐటీయూ రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎస్‌ వీరయ్య.
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
అంగన్‌వాడీ టీచర్లు వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడాలని, సమ్మెను ఉధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎస్‌ వీరయ్య పిలుపునిచ్చారు. తమను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ తదితర డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ అధ్వర్యంలో సెప్టెంబర్‌ 11 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు అంగన్‌వాడీలు దిగిన విషయం విధితమే. బుధవారం ఏటూరునాగారం ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు సమ్మె శిబిరాన్ని వీరయ్య సం దర్శించి మాట్లాడారు. కనీస సమస్యలు పరిష్క రించాలని పోరాడే సంఘాలను చర్చలకు పిలవక పోవటం అప్రజాస్వామికం అన్నారు. సమస్యలే లేవని చెప్పి, ప్రభుత్వం అంగన్వాడి టీచర్లను పోలీ సులతో బెదిరించి పోలిస్‌ స్టేషన్లకు పిలిపించడం సిగ్గు చేటు అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. దీంతో అంగన్‌వాడీలు సమ్మెలోకి అని వార్యంగా దిగాల్సి వచ్చిందని అన్నారు. వేతనాలు పెంచాలని మొరపెట్టుకుంటున్నా పెంచడం లేదని, అంగన్వాడీల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యద ర్శులకు, ఐకేప వీఓఏలకు అప్పజెప్పాలనే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. జరిపిన చర్చలు పాత పద్ధతిలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందిం చి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా కార్యదర్శి బి సాంబ శివ, పి చిట్టిబాబు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె సరోజ, జమున, సరిత, సూరమ్మ, లలిత, రమాదేవి, అరుణ, సరళ, సుమలత, ఆదిలక్ష్మి, రజిత, సుగుణ రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love