మంత్రి సత్యవతీ రాథోడ్ కు వినతి పత్రం అందజేసిన అంగన్ వాడిలు

నవతెలంగాణ-నసురుల్లాబాద్ : అంగన్ వాడి టీచర్స్, హెల్పర్స్, కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కనీస వేతనం కల్పించాలి అని కోరుతూ మంగళవారం మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు సత్యవతి రాథోడ్ ను నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ , సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం గా మంత్రి సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా అంగన్ వాడి, సిఐటియు నాయకుడు కలిల్ మాట్లాడుతూ ఐసిడిఎస్ లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్ పేరుతో పనిచేసినా ఉద్యోగులతో సమానంగా జాబ్ చార్ట్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య టీచర్స్ గా పనిచేస్తూ ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీ,బాలింత స్త్రీలు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు సేవలందిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పని చేస్తున్నామని తెలిపారు. ఐసిడిఎస్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వయోభారం, అనారోగ్యాలతో ఇటీవలి కాలంలో చాలామంది మరణించారని ,ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు
Spread the love