ప్రజాఉద్యమాల వేగుచుక్క బోయిన అంజయ్య

Spark of public movements
Boina Anjaya– సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్‌
ప్రజాసమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం పోరాడిన వేగుచుక్క బోయిన అంజయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో నిర్వహించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ బోయిన అంజయ్య 16వ వర్థంతి సభకు ఆమె హాజరై మాట్లాడారు. గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన బోయిన అంజయ్య.. దొరల పాలన అంతం కావాలంటే కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి పార్టీలో చేరారని తెలిపారు. అనివార్య కారణాలతో పార్టీని వీడినా చనిపోయేంతవరకూ కమ్యూనిస్టుగానే జీవించారని తెలిపారు. ఇమాంపేట గ్రామసర్పంచ్‌గా ఎన్నికై గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో అంజయ్య చేసిన కృషి మరువలేదన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పాముల ఉపేందర్‌, మాజీ సర్పంచ్‌ బోయిన ఝాన్సీ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, కొప్పుల రజిత, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బోయిన పృథ్వీరాజ్‌ యాదవ్‌, గ్రామ నాయకులు నగిరే అన్వేష్‌, ఉపేందర్‌, గుండాల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love