నవతెలంగాణ – మద్నూర్
శ్రావణమాసం రెండవ శనివారాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయం గంగుశెట్టి హనుమాన్ ఆలయం వద్ద భక్తుడు నల్లవార్ పవన్ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రసాదాన్ని స్వీకరించారు.