కొత్తపల్లిలో అన్నదానం కార్యక్రమం..

నవతెలంగాణ -రాయపోల్

అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప కార్యక్రమమని బీఅర్ఎస్ నాయకులు కల్లూరి శ్రీనివాస్, మన్నె ఆంజనేయులు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీ సిద్ద వినాయక యూత్ వారు  వినాయకుని మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుని వద్ద శ్రీ సిద్ద వినాయక యూత్ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు.ప్రతి ఒక్కరూ మానవత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. యువకులు మంచి మార్గంలో నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు దాసరి బాల్ నర్సింలు, మంతూరి యాదగిరి,రాజారం,మధు, రాజాగౌడ్,మల్లేశం,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love