రోడ్డు ప్రమాదంలో అన్న చెల్లెల మృతి

నవతెలంగాణ – ధర్మసాగర్
రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.స్థానిక సీఐ ఒంటేరు రమేష్ తెలిపిన విరాల ప్రకారం మండలంలోని రాంపూర్ గ్రామం ఔటర్ రింగ్ రోడ్డుపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద అందాల ఉదయం 9 గంటల సమయంలో హాసనపర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన అన్నా చెల్లెలు పోరెడ్డి సుజిత్ రెడ్డి,పోరెడ్డి పూజ లు హైదరాబాదు నుండి బయలుదేరి వారి స్వగ్రామం అయిన నాగారం కి వెళ్తున్న క్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొనటం వలన ఇద్దరి తలకి మరియు శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందరని తెలిపారు. విశ్వాసనీయుల సమాచారం మేరకు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారని తెలిపారు.

Spread the love