లాట్‌ మొబైల్స్‌లో వార్షికోత్సవ ఆఫర్లు

హైదరాబాద్‌ : మల్టీబ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌ 11 వార్షికోత్సవం సందర్బంగా నూతన ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్బంగా సంస్థ డైరెక్టర్‌ ఎం అఖిల్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని 150కి పైగా స్టోర్స్‌ల్లో భారీ డిస్కౌంట్లపై ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. రూ.3,999 విలువ చేసే ఎయిర్‌పాడ్స్‌ లేదా వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌లను కేవలం రూ.11కే అందిస్తామన్నారు. తమ వద్ద కొనుగోలు చేసే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టివి, ఎయిర్‌ కండీషనర్స్‌ ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై రూ.2500 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నామన్నారు. తమ వద్ద ప్రారంభ ధర రూ.8,499 నుంచి స్మార్ట్‌ టివిలు, రూ.16,500తో బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతాయన్నారు. పలు మొబైల్స్‌పై రూ.10వేల వరకు క్యాష్‌ బ్యాక్‌, స్మార్ట్‌ గాడ్జెట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపుతో ఉత్పత్తులు లభ్యమవుతాయని ఆ సంస్థ డైరెక్టర్‌ ఎం సుప్రజ తెలిపారు.

Spread the love