నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల జవహర్‌నగర్‌లో ఓ బాలుడిని కుక్కలు పీక్కుతిన్న ఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతులకు కుమారుడు క్రియాన్ష్(4). ఆ చిన్నారి 20రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు బాలుడు మృతి చెందాడు.