నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఇస్నాపూర్ నుండి నందిగామ వెళ్ళే రోడ్డులో ఉన్న మహిదర వెంచర్ దగ్గర విశాల్ అనే ఆరేళ్ల బాలుడిపై వీదికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కూలి పనులు చేయడానికి బాలుడి కుటుంబం బీహర్ నుంచి వచ్చినట్లు తెలిసింది. మృతదేహన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.