బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి..

నవతెలంగాన – హైదరాబాద్: బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే.  తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను బీహార్‌ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్‌ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది. అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. కాగా గురువారం కిషన్‌బాగ్‌ జిల్లాలో, జూన్‌ 23న తూర్పు చంపారన్‌ జిల్లాలో, 22న సిశాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love