నవతెలంగాణ హదరాబాద్: ఎన్నికల ఓడిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు ఒకరి తరువాత ఒకరి షాకులు ఇస్తూనే ఉన్నారు. కారు దిగి అధికార కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు, శాసనమండలి సభ్యుడు చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు వినిపిస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టే. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఈ చేరికతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.