చంద్రబాబుపై మరో కేసు..

నవతెలంగాణ-హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నాడు. ఇక రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ ఐ ఆర్ లపై చంద్రబాబు తరపున లాయర్ లు సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ ను హై కోర్ట్ లో వేశారు.. దానికి సంబంధించిన విచారణ కాసేపటి క్రితమే పూర్తి అయింది. కానీ ఈ పిటిషన్ పై తీర్పును మాత్రం న్యాయస్థానం రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో కేసును చంద్రబాబు పై సిఐడి వేసింది. గతంలో ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఏసీబీ కోర్ట్ లో పిటిషన్ వేయగా, ఈ కేసును విచారించడానికి ఏసీబీ కోర్ట్ అంగీకరించింది. కాగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుని ప్రధాన ముద్దాయిగా పేర్కొనడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించి కోర్ట్ లో చంద్రబాబు తరపున లాయర్ విధించాల్సి ఉంటుంది.

Spread the love