మనీశ్‌ సిసోడియాపై సీబీఐ మరో కేసు

– జైలుకు పరిమితం చేసేందుకు కుట్ర : ఆప్‌
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్‌ జైళ్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. చట్ట వ్యతిరేకంగా ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను రూపొందించి అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగాలు మోపింది. సిసోడియాతో పాటు మరో ఐదుగురిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సిసోడియాను ఇక జైలుకు పరిమితం చేసేందుకే మరో కేసు పెట్టారని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Spread the love