టెట్ అభ్యర్థులకు మరో అవకాశం

నవతెలంగాణ – హైదరాబాద్:  టెట్‌లో మార్కులు, హాల్ టికెట్, ఇతర వివరాల సవరణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇవ్వనుంది. డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని కోరుతున్నారు. ఇవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇస్తే సమస్యలొస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండు రోజులపాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. దీనిపై నేడు లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశముంది.

Spread the love