కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన సూరజ్‌ శుక్రవారం మరణిం చింది. గత ఐదు నెలల్లో ఇక్కడ మరణిం చిన ఎనిమిదవ చీతా ఇది. కొన్ని రోజుల క్రితం మంగళవారం దక్షిణాఫ్రికా నుంచి తీసుకుని వచ్చిన చీతా తేజాస్‌ మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. సూరజ్‌ మరణానికి ఇంకా కారణం తెలియలేదు. తేజాస్‌ గాయాలతో మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కునో నేషనల్‌ పార్క్‌లో మార్చి 27న తొలి చీతా మరణించింది. కిడ్నీల సమస్యతో సాషా అనే చీతా మరణించింది. తరువాత ఏప్రిల్‌లో ఒక చీతా గుండె సమస్యలతోనూ, మే ప్రారంభంలో ఒక చీతా ఇతర చీతాల దాడిలోని మరణించాయి. మార్చిలో సియ య అనే చీతా నాలుగు పిల్లలకు జన్మ నిచ్చింది. ఇందులో ఒకటి మేలోనూ, తరువాత అదే నెలలో కొన్ని రోజులకే మరో రెండు పిల్లలు మరణించాయి. ఈ మూడు చీతా పిల్లల మరణాలకు నీరసంగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చెబు ఓతు న్నారు. నమీబియా నుంచి భారత్‌కు తీసుకు నివచ్చిన ఎనిమిది చీతా లను గత ఏడాది సెప్టెంబర్‌ 17న కునో నేషనల్‌ పార్క్‌లో ప్రవేశపెట్టారు. తరు వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకుని వచ్చారు. ఇందులో ఆరు చీతాలు ప్రస్తుతం అడవిలో ఉండగా, మిగిలినవి కునోలోనే వివిధ ఎన్‌క్లోజర్లలో ఉన్నాయి.

Spread the love