యూనివర్సిటీ లో మరో దఫ సోదాలు..

– అవినీతి అక్రమాలు వెలుగు లోకి వచ్చేనా..
– ఉదయ నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగిన సోదాలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలలుగా వివాదాలతో చర్చనీయమంశమైన తెలంగాణ యూనివర్సిటీపై ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టి సారించింది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అవినీతి, అక్రమాలు,ఇతర అంశాలపై పలు విమర్శలు, ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. మంగళవారం రేండో సారి విజిలెన్స్ అధికారులు యూనివర్సిటీ లోని పలు విభాగాల లోని ఫైల్స్ లన్నింటిని జల్లెడ పడ్తున్నారు. వీసీ తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక లావదేవీలు, తదితర అంశాలను విజిలేన్స్ అధికారులు రికార్డు చేసుకున్నారు. ఏవో కార్యాలయం, ఎస్టాబ్లిజ్మెంట్ కార్యాలయం, అకౌంట్ సెక్షన్, ఇంజ నీరింగ్ విభాగాలను, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఫోన్లను స్విచ్చాఫ్ చేయించి తనీఖీ లను చేపడుతున్నారు.అత్యంత జాగ్రత్తగా తలుపుతు మూసివేసి ఎలాంటి సమాచారం బయట తెలియకుండా ముందస్తు చర్యలు చేపడుతూ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడే కార్యాలయానికి వెళ్లిన అధికారులు మాజీ రిజిస్ట్రార్ గా పనిచేసిన విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆరతి లకు విచారణ కు రావలని ఆదేశించగా ఆ సమయంలో వారు యూనివర్సిటీ లో అందుబాటులో లేకపోవడం తో రాలేకపోయారు. సుదీర్ఘంగా జమా ఖర్చుల విభాగంలో సంబంధిత శాఖ అధికారి భాస్కర్ తో క్షుణ్ణంగా వివరాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. వీసీ తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, ఆక్రమ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన ఫైల్స్ ను వారు పరిశీలించారు. అక్కడి నుంచి ఎస్టబిలిష్ మేంట్ విభాగానికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సాయాగౌడ్ ను సూపరిండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఏలా పదోన్నతి పొందారో వివరాలు అందించాలని సాయాగౌడ్ ను విజిలెన్స్ అధికారులు కోరగా ఆయన సమాధానం పూర్తి వివరాలతో అందజేశారు. వారి ఎదుటే సెక్షన్లో ఉన్న జ్యోతి పదోన్నతుల విషయంలో సాయాగౌడ్ వాగ్వాదం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అకాడమీక్ కన్సల్టెంట్లకు బేసిక్ పే ఎంత ఇస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను, పదోన్నతుల వివరాలను తమ వెంట తీసుకెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యూనివర్సిటీ లోని పలు విభాగాల్లోని తలుపులు మూసివేసి తనిఖీలు చేయడం గమనించదగ్గ విషయం. ఈ విషయమై విజిలెన్స్ అధికారులను విలేకరులు సంప్రదించగా తాము తనిఖీ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వడమే అని, ఏలాంటి సమాచారం బయటికి చెప్పలేమని అధికారులు అన్నారు. వీసీ అవినీతి అక్రమాలను విచారణ చేయించాలని ఈసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలతో అందుకు అనుగుణంగా విజిలెన్స్ అధికారులు రెండో దఫ సోదాలు నిర్వహించారు.ఉదయం విజిలెన్స్ అధికారుల బృందం నలుగురు వర్సిటీలో సోదాలు చేశారు. సోదాల సమయంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, వైస్ చాన్సలర్ లు యూనివర్సిటీ లో లేకపోవడం ఇది రెండోసారి గత కొన్ని రోజుల క్రితం బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదరులకు వచ్చినపుడు కూడా వీరిద్దరూ అరగంట ముందే లేకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఏదిఏమైనా ఈ సోదాల్లో జరిగిన అవినీతి ఆక్రమాలు వెలుగులోకి వస్తాయని నమ్మకం తమకుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Spread the love