విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ-విశాఖపట్నం: నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో గురువారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 40కిపైగా బోట్లు కాలి బూడిదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Spread the love