నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది.