నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్

నవతెలంగాణ – అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, ఇవాళ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 81 ఉద్యోగాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, డీఎస్పీ పోస్టులు 26 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 1వ తేదీ నుండి జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. మార్చి 17వ తేదీన గ్రూప్-1 నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం అధికారిక సైట్ సందర్శించాలని సూచించారు. కాగా, రోజుల వ్యవధిలోనే వరుస నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలు తెరుస్తున్నారు.

Spread the love