నవతెలంగాణ హైదరాబాద్: గవర్నర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె గవర్నర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాజ్ భవన్ లో చోటుచేసుకుంది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మరో ఎన్.డీ తివారి కానున్నారా?
కాగా, ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు దెబ్బతిని ఉండటం, దానికి తోడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్న సమయంలో ఈ పరిణామాలు బీజేపీకి షాక్‌నిచ్చాయి. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ అని అన్నారు. ‘ఒకవేళ ఎవరైనా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నాపై దుష్ప్రచారం చేయొచ్చు. అయితే బెంగాల్‌లో అవినీతి, హింససై నా పోరాటాన్ని ఆపలేరు’ అని ఆయన పేర్కొన్నారు.