తిరుమల బోనులో చిక్కిన మరో చిరుత..

నవతెలంగాణ – తిరుపతి: తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో చిరుత బోనులో చిక్కింది.. అలిపిరి నడక మార్గంలో లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం సమీపంలో దగ్గర పట్టుకున్నారు.. దీనిని కూడా తిరుపతిలోని జూకు తరలించారు. వారం రోజులుగా కెమెరాల ద్వారా కదలికల్ని గమనిస్తూ ఈ చిరుతను కూడా ట్రాప్ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఆరు చిరుతల్ని అటవీశాఖ అధికారులు బంధించారు.. వీటిని తిరుపతిలోని జూకు తరలించారు. అయితే ఆరు చిరుతల్లో మూడు చిరుతల్ని అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో జూలో మూడు చిరుతలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Spread the love