27 లోపు సమాధానమివ్వాలి..కేసీఆర్‌కు మరో లేఖ

నవతెలంగాణ-హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసింది. విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని ఈ నెల 19న లేఖ పంపించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలియజేయాలని అందులో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొన్న విద్యుత్‌ గురించి మరింత సమాచారం కోరింది. ఇటీవల కమిషన్‌ ఎదుట పలువురు లేవనెత్తిన సందేహాలను లేఖలో ప్రస్తావించింది. వాటిపై ఈ నెల 27 లోపు సమాధానమివ్వాలని కమిషన్‌ సూచించింది.

Spread the love