భిన్న సినిమా హిడింబ

హీరో అశ్విన్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘హిడింబ’. అనీల్‌ కన్నెగంటి దర్శకుడు. అనిల్‌ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌, ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్ర రివర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో అశ్విన్‌ బాబు మాట్లాడుతూ, ‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. స్క్రీన్‌ ప్లే, విజువల్స్‌ రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా ఉంటాయి. అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు. ‘ఈ సినిమా రిలీజ్‌ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. ట్రైలర్‌, టీజర్‌ చూసిన ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది మా విజయంగా భావిస్తున్నాం. ఈనెల 20 తర్వాత కూడా ఇదే విజయానందంతో కలుస్తాం’ అని హీరోయిన్‌ నందితా శ్వేతా చెప్పారు. దర్శకుడు అనీల్‌ కన్నెగంటి మాట్లాడుతూ,”హిడింబ’తో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. చరిత్రని వెతుక్కుంటూ వెనక్కివెళ్ళే ఇన్వెస్ట్‌గేషన్‌ థ్రిల్లర్‌ ఇది. దీనికి సింబాలిక్‌గా ఉంటుందని రివర్స్‌ ట్రైలర్‌ని కట్‌ చేశాం. ఇలా చేయటం టాలీవుడ్‌లోనే ఫస్ట్‌ టైమ్‌. ఇదొక డిఫరెంట్‌ మూవీ. ప్రేక్షకులకు తప్పకుండా గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు. హిడింబ ట్రైలర్‌, టీజర్‌ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా హిట్‌ ఖాయం’ అని నిర్మాత శ్రీధర్‌ చెప్పారు.

Spread the love