విశాఖలో మరో రియాల్టర్ కుటుంబం కిడ్నాప్

నవతెలంగాణ – విశాఖ
విశాఖలో మరో కిడ్నాప్‌ సంఘటన చోటు చేసుకుంది. విశాఖలో మరో రియాల్టర్ కుటుంబం కిడ్నాప్ అయింది. విశాఖకు చెందిన రియాల్టర్ శ్రీనివాస్ ను అతని భార్య ను కిడ్నాప్ చేశారు కొంతమంది దుండగులు. విశాఖలో 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కి గురయ్యారు దంపతులు. అయితే.. ఈ కిడ్నాప్‌ నేపథ్యంలో శ్రీ చరణ్ రియాల్టర్ సంస్థ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశాఖ పోలీసులు. ఏడుగురు దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందించారు పోలీసులు. శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్‌ అయ్యారు. ఇక ఈ సంఘటనపై గాలింపు చర్యలు చేపడుతున్నారు విశాఖ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love