బీఆర్ఎస్ కు మరో షాక్ .. పార్టీని వీడిన కీలక నేత

నవతెలంగాణ హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగి చేయి ఆందుకొనున్నట్టు సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నన్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో కోనప్పపై ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చినా.. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప అభ్యంతరం చెబుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్‌తో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారా.. అని ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కోనేరు కోనప్ప తన కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. నేడు కోనేరు కోనప్ప తాను తీసుకునే నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది.

Spread the love