బీఆర్ఎస్ కు మరో షాక్..ఎమ్మెల్సీల రహస్య భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్: పది మంది ఎమ్మెల్సీలు కారు దిగేందుకు రెడీ అయిపోయారని తెలుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని ఫంక్షన్ హాలులో జరిగిన ఓ దావత్ కు అంతా కలిసి అటెండ్ అయ్యారని తెలుస్తోంది. భేటీలో కీలక అంశాలపై మాట్లాడుకున్న ఎమ్మెల్సీలు పనులు పూర్తి కావాలన్నా.. ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కావాలన్నా పార్టీ మారాల్సిందేనని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ దావత్ ను ఆర్గనైజ్ చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు, హైదరాబాద్ నుంచి ముగ్గురు, వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు, కరీంనగ్ నుంచి ఒకరితోపాటు, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది.
పార్టీ అధికారం కోల్పోవడం, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 15 చోట్ల పార్టీ మూడో స్థానానికి దిగజారడం, స్కామ్స్ బయటపడుతుండటం, లిక్కర్ కేసులో అరెస్టయిన అధినేత తనయ కవిత తీహార్ జైల్లో ఉండటం.. రోజు కో కుంభకోణం బయటికి వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ లో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్సీ గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఈ దావత్ ను అరేంజ్ చేసి లైక్ మైండెడ్ ఎమ్మెల్సీలను పిలిచినట్టు తెలుస్తోంది. హాజరైన వాళ్లంతా ఒకరితో ఒకరు తమ బాధలను చెప్పుకొన్నట్టు సమాచారం. రోజు రోజుకూ పార్టీ పరిస్థితి దిగజారుతోందని, పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. పనులు జరగాలన్నా.. పదవులు రెన్యూవల్ కావాలన్నా పార్టీ మారడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Spread the love