తెలంగాణ అభివృద్ధికి మరో పోరాటం : ప్రొఫెసర్‌ కోదండరాం

నవతెలంగాణ-మహబూబాబాద్‌
ప్రజల ఆకాంక్షల మేరకు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని మాజీ జే ఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ జెఎసి చైర్మన్‌ డాక్టర్‌ డోలి సత్య నారాయణతో కలిసి ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారం భించారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల స్థూపాలు నిర్మిం చినప్పటికీ మానుకోట స్తూపం అమరవీరులకు చి హ్నంగా మిగిలిందన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ప్రజలు విరోచితంగా పోరాడిన రోజులు మళ్లీ గుర్తుకొ స్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి మానుకోట ఘటన ఊపిరి పోసిందన్నారు.తెలంగాణ గడ్డపై సీ మాంధ్ర నాయకులు సాగిస్తున్న పెత్తందారు విధానా లకు మానుకోట రైల్వే స్టేషన్లో విద్యార్థి ఉద్యమకారు లు ఎదుర్కొన్నారు అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రా ష్ట్రంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదని అన్నా రు. నేటికీ దోపిడీ కొనసాగుతుందని, పోడు రైతులకు పట్టాలు ఇవ్వడానికి చేతులు రావడంలేదని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రాసి పేపర్‌ లీకే జీలతో విసిగి వేసారి పోయారన్నారు. తెలంగాణ రై తులు ధాన్యం అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నా రని, కొనుగోలు కేంద్రాలలో దోపిడీ కొనసాగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి రాజ కీయ మహిళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయ కులు మాల మహానాడు జాతి అధ్యక్షులు అద్దంకి ద యాకర్‌ఉద్యమకారులు అంబటి శ్రీనివాస్‌, మారినేని వెంకన్న, పాపిరెడ్డి, తక్కెళ్ళపల్లి ప్రభాకర్‌ రావు, మం డల వెంకన్న, డాక్టర్‌ బి.నెహ్రూ రాథోడ్‌, గుగ్గిల పేర య్య, పరకాల శ్రీనివాస్‌ రెడ్డి, చిన్న చంద్రన్న, మైసా శ్రీనివాస్‌, చుంచు శ్రీశైలం పాల్గొన్నారు.

Spread the love