కోటాలో మరో విద్యార్థి మృతి..

నవతెలంగాణ – రాజస్థాన్: రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఏడాది 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని మోతీహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్(17) అనే విద్యార్థి రెండేళ్లుగా మహావీర్ నగర్ ప్రాంతంలో నివాసముంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం అర్దరాత్రి తన గదికి వెళ్లిన జైస్వాల్ అందులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం జైస్వాల్ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు తలుపులు పగులగొట్టగా ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Spread the love