కోటాలో మరో విద్యార్థి మృతి

నవతెలంగాణ – రాజస్థాన్‌ : ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి జెఈఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాది కాలంగా తన తల్లితోపాటు కోటాలోని తలవండి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో కోటాలో 16 మంది విద్యార్థులు మృతి చెందారు. గతేడాది 30 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Spread the love