నవతెలంగాణ-హైదరాబాద్ : రైలు కింద పడి మరిది, వదిన ఆత్మహత్య చేసున్న సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్దారవీడు మండలం బద్వీడు చెర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(30), రాములమ్మ(27) వదినా మరిదిలు. గత కొంతకాలంగా వీరు వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిపోయారు. అనంతరం కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. మృతురాలు రాములమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.