మేడారంలో మరో విషాదం..

– జంపన్న వాగు(గుండ్ల మడుగు) లో భక్తుడి మృతి
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం జంపన్న వాగులు మరోమారు అపశృతి చోటుచేసుకుంది. జంపన్న వాగు కొత్తూరు ప్రాంతంలో గల గుండ్లమడుగులో మునిగి మరో యువకుడు(భక్తుడు) మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్కు చెందిన రాపాని రాజు(22) గా గుర్తించారు. ఎస్టేట్ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాపాని రాజు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి శనివారం సాయంత్రం మేడారం వనదేవతల దర్శనానికి మేడారానికి వచ్చారు. ఉదయం పుణ్య స్థానాల ఆచరించి వనదేవతలను దర్శించుకోవడానికి జంపన్న వాగు వద్దకు చేరుకోగా జంపన్న వాగులో నీరు లేకపోవడంతో కొత్తూరు కాజ్వే సమీపంలో గల గుండ్లమడుగు నీటిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు దానిలోకి జారిపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాడ్వాయి పోలీస్ ఏఎస్ఐ నారాయణ కానిస్టేబుల్ నీలకంఠేశ్వరన్,  వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటి లోపల ఉన్న మృతుడి డెడ్ బాడీ వెతికి బయటికి తీశారు. సాహసం చేసి కన్నెపల్లి గ్రామానికి చెందిన గొంది నర్సింగరావు సహకారంతో, మృతుని డెడ్ బాడీని బయటికి తీసిన పోలీస్ కానిస్టేబుల్ నీలకంఠేశ్వర్ వెంకటేశ్వరరావు లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. వారి తండ్రి అనుమంతు ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love