చిత్ర పరిశ్రమలో మరో విషాదం..నటుడు హఠాన్మరణం

నవతెలంగాణ-హైదరాబాద్ : కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వర్దమాన సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. 39 ఏళ్ల నితిన్ గోపీ కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ ‘హల్లో డాడీ’ చిత్రంలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం నితిన్ గోపీని ఆస్పత్రికి తరలించగా, వైద్యుల చికిత్సకు ఆయన స్పందించలేదు. దీంతో వైద్యులు ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. నితిన్ గోపి హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాలు వెల్లువెత్తాయి. నితిన్ గోపీ ఇంకా వివాహం చేసుకోకపోవడంతో బెంగళూరులోని తన తల్లిదండ్రుల వద్దే ఆయన ఉంటున్నారు. కన్నడ చిత్రాలు, టెలివిజన్ షోలతో నితిన్ గోపీ మంచి పేరు తెచ్చుకున్నారు. శృతినాయుడు నిర్మించిన ‘పునర్ వివాహ’ సీరియల్‌తో ఆయన బాగా పాపులర్ అయ్యాయి. ‘హరహర మహదేవ’ భక్తి రసాత్మక సీరియర్‌తో పాటు పలు తమిళ సీరియల్స్‌ కూడా ఆయన నటించారు. తాజాగా ఆయన ఓ సీరియల్‌కు దర్శకత్వం వహించాలనే ఆలోచనతో ప్రముఖ కన్నడ ఛానెల్‌తో చర్చలు కూడా సాగించారు. ఆయన కేరళిడ కేసరి, నిశ్సబ్ద, చిరబాందవ్య తదితర సినిమాల్లోనూ నితిన్ నటించారు.

Spread the love