తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూనే వాసు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా వాసుకు మంచి గుర్తింపు ఉంది.

Spread the love