నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది తన కొడుకు కాదని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తండ్రి రుహుల్ అమిన్ తెలిపారు. పోలీసులు తన కుమారుడిపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. తన కుమారుడు ఎప్పుడూ పొట్టి జుట్టుతోనే ఉంటాడని తెలిపారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్‌లో చాలా హత్యలు జరిగాయని, వాటిని చూసి భయపడి అతడు భారత్ వెళ్లాడని వివరించారు.