కాటాపూర్ లో మరో వాటర్ ప్లాంట్ ప్రారంభం

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ గ్రామంలో శుద్ధి చేయబడిన మినరల్ వాటర్ తక్కువ ధరకు అందరికీ అందించి ఉద్దేశంతో వామిక ఆర్వో వాటర్ ప్లాంట్ ను మాజీ మండలాధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. వివాది శుభకార్యాలకు చల్లని నీరు అతి తక్కువ ధరకు లభించును అని తెలిపారు. మండలంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ ప్రొప్రైటర్ ముండ్రాతి రాజశ్రీ శ్రీనివాస్, మండల కో ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, నాయకులు సయ్యద్ హుస్సేన్ (వహీద్), దేశ కోటయ్య మహిపతి లక్ష్మీనరసయ్య, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుర్క వీరబాబు, కొండ బత్తుల లక్ష్మణ్, రాజు, దానక నరసింహారావు, కోడం సత్యం, ఇస్మాయిల్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love