యూపీలో మరో మహిళపై తోడేలు దాడి

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో మరోసారి ఓ మహిళ(28)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాధితురాలి మెడ, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆరు తోడేళ్లలో అధికారులు ఐదింటిని పట్టుకోగా, మరొకటి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. అది గత 4 రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆరో తోడేలును పట్టుకోవడం కష్టమవుతోందని అధికారులు వివరిస్తున్నారు.

Spread the love