లోన్‌ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

suicideనవతెలంగాణ – హైదరాబాద్: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కొత్తగూడేనికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజ్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శీలం మనోజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఏజెంట్లు ఫోన్ చేశారు. దీంతో పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ చదువుతున్నాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Spread the love