ఆన్‌లైన్‌ రమ్మీకి మరో యువకుడి బలి

నవతెలంగాణ – చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీలో భారీగా నగదు కోల్పోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెన్‌కాశి జిల్లా శంకర్‌కోయిల్‌కు చెందిన మారిసెల్వన్‌ ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసైన మారిసెల్వన్‌ సుమారు రూ.10 లక్షల నగదు కోల్పోయినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love