నవతెలంగాణ-హైదరాబాద్: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో భాగంగా స్టేజ్‌పై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయారు. అప్రమత్తమైన సహాయ సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకున్నారు. దీంతో పీఎంకు ఎలాంటి గాయలు కాలేదు. మే 3న ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అల్బనీస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం న్యూ సౌత్ వేల్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ఆంథోనితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. స్టేజ్‌పై ప్రసంగం తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఆయన అక్కడినుంచి వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అక్కడే ఉన్న నేతలు ఆయన్ని పైకి లేపారు. అయితే, ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని స్థానిక మీడియా పేర్కొంది.