అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు ముగించిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.

Spread the love