త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పునకు కృషి చేస్తా: అనురాగ్ ఠాకూర్

– భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి ని గెలిపిస్తే ఆరు నెలలో
నవతెలంగాణ – భువనగిరి
బీజేపీ  ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరు నారాయణ రెడ్డి  నామినేషన్ సందర్భంగా  భువనగిరి పట్టణంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా  ముఖ్య అతిథిగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి వర్యులు అనురాగ్ ఠాకూర్ సాయిబాబా గుడి నుండి వినాయక చౌరస్తా వరకు జన సమూహంతో వెళ్తున్న ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్తులను గెలిపించుకునే బాధ్యత బీజేపీ నాయకులు కార్యకర్తలదే నని తెలిపారు. భువనగిరి లో గూడూరు నారాయణ రెడ్డి ని గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత భువనగిరి ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి 30 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని  తెలిపారు. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత స్వంత నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తానని , వలిగొండ మండలాన్ని హెచ్ ఎం డి ఏ పరిధిలోకి తీసుకొచ్చి వలిగొండ మండలాన్ని అభివృద్ధి చేస్తానని, మూసి నది ప్రక్షాళన చేపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love