
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడం జరిగిందని ఎలాంటి సమస్యలు అయినా ఆయా కుటుంబాల వారు తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటిని సరి చేస్తామని గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ తెలిపారు. కుటుంబ సర్వేలో తప్పిపోయిన వారు ఉంటే గాని, కొత్త కుటుంబాల వారు గ్రామపంచాయతీకి విచ్చేసి సరి చేసుకోవాలని ఆయన కోరారు.